ఏ అభివృద్ధి కార్యక్రమమూ ఎన్నికల కోసం చేయలేదు : ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ఎన్నో భారీ అభివృద్ధి పథకాల అమలును ఎప్పుడూ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శకులు చేసే వారికి ప్రత్యక్షంగా కనబడుతున్నఈప్రాజెక్టులే సమాధానమని స్పష్టం చేశారు. ఇటానగర్‌లో డోనీ పోలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సంస్కృతి నుండి వ్యవసాయం వరకు,వాణిజ్యం నుండి కనెక్టివిటీ వరకు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికే తమ ప్రధమ ప్రాధాన్యమని మోదీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో 9 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తే,గత ఎనిమిదేళ్ల పాలనలోనే 7కొత్త విమానాశ్రయాలతో కనెక్టివిటీని మెరుగుపరిచాయని వివరించారు.

 

మౌలిక సదుపాయాల అభివృద్ధి,కనెక్టివిటీని పెంచడం ఈశాన్య పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోందని అన్నారు. ఈశాన్య ప్రాంతాల జీవనోపాధిలో వెదురు ఒక ముఖ్యమైన భాగమని, ఇది బ్రిటిష్ వలస పాలనలో పరిమిత ఆంక్షల చట్రంలో ఇరుక్కుందని, అయితే ఆ నియంత్రణ చట్టాలను తాము మార్పు చేశామని వెల్లడించారు.

 

ప్రతి విషయాన్నీ ఎన్నికల కోణం నుంచే కొందరు చూస్తుంటారని, అలాంటి వాళ్లు తమ కంటి అద్దాలను మార్చుకోవాలని మోదీ సూచించారు. ప్రతీ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే అలవాటు వున్న వారికి ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభం కావడం ఓ చెంపపెట్టు అని మోదీ అన్నారు. అనేక రెట్ల ఉత్సాహంతో దేశం ప్రగతి పథంలో నడుస్తోందని, ఇప్పటికైనా పంథాను మార్చుకోవాలని మోదీ హితవుపలికారు.

 

Related Posts

Latest News Updates