ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నేడు నాలుగో వందే భారత్ రైల్ ను మోదీ ప్రారంభించారు. ఉనా రైల్వే స్టేషన్ లో ఉనా రైల్వేస్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. వందే భారత్ రైలు ఉనా–ఢిల్లీ స్టేషన్ల మధ్య నడవనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రైలు బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఉదయం 5:50 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి, 11.05 కి అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లి.. 6.25 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలుతో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అధికారులు ప్రకటించారు.
మరో వైపు నరేంద్ర మోదీ చంబాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీటి సరఫరా, ఆరోగ్యం, డిజిటల్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. గత ఇబ్బందులను దాటుకుంటూ.. దేశం ముందుకు వెళ్తోందని, వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఉనా మరియు హిమాచల్ ప్రదేశ్ కు ముందుగానే దీపావళి వచ్చిందన్నారు. ఈ రోజే నూతన భారత వందే రైల్ ను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపి పాలితప్రాంతాలు కావడంతో ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో స్వర్ణయుగం నడుస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతి పంచాయితీకి బ్రాడ్ బాండ్ సర్వీసును కల్పించడంతో పాటూ… ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.