రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ను మోదీ సందర్శించారు. ఆయన వెంట గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అధికారులు వున్నారు. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఎఫ్.సీ.ఐ, ఆర్.ఎఫ్.సీ.ఎల్ గా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించారు. ఆ తర్వాత భద్రాచలం రోడ్డు- సత్తుపల్లి రైల్వే లైన్ ను వర్చువల్ గా ప్రారంభించారు.