ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం

ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఘనవిజయం సాధించింది. నెతన్యాహు పార్టీ 120 సీట్లకు గానూ 64 సీట్లను కైవసం చేసుకుంది. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి యాయిర్ లాపిడ్ తన పరాజయాన్ని అంగీకరించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహుకు అభినందనలు తెలిపారు.

 

ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఘన విజయం సాాధించిన నెతన్యాహును అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. హిబ్రూ భాషలో ” మాజెల్ తోవ్ మై ఫ్రెండ్” అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates