‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి కంగ్రాట్స్ తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

”ఆర్ఆర్ఆర్” సినిమాలోని ”నాటు నాటు నాటు” పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కి సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ సహా ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను ట్యాగ్ చేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు భారతదేశాన్ని గర్వపడేలా చేసిందని మెచ్చుకున్నారు. అందులో భాగంగా ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఆయన కొనియాడారు. దాంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను అనౌన్స్ చేస్తున్న వీడియోను ఆర్ఆర్ఆర్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ ట్వీట్ ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates