నాల్గవ టెస్టు మ్యాచ్‎లో సందడి చేసిన భారత ప్రధాని..ఆస్ట్రేలియా ప్రధాని

భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ హాజరయ్యారు. గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి ఇద్దరు ప్రధానులు హాజరయ్యారు. వీరిద్దరికీ గుజరాత్ అసోసియేషన్ అధికారులు, బీసీసీఐ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టాస్ గెలిచిన అనంతరం స్టేడియంలో జాతీయ గీతం ప్రారంభం కాగానే ఇరు దేశాల నేతలు ఆటగాళ్లతో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. ప్రధాని మోడీని ఆటగాళ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ పరిచయం చేశారు.

75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా వీరిద్దరూ మ్యాచ్‎ను ప్రత్యేక్షంగా తిలకించారు. ఒకవైపు సిరీస్‎ను డిసైడ్ చేసే మ్యాచ్.. మరోవైపు ఇద్దరు దేశ ప్రధానులు రావడంతో అభిమానులతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఇరు దేశాల ప్రధానులను బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది…

ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి మరుపురాని గుర్తుగా బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ ఆల్బనీస్(Albanese) మెమొంటోను గుర్తుగా ఇచ్చారు. ఇరు దేశాల ప్రధానులు గోల్డ్ పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియం మొత్తం తిరుగుతూ అభిమానులకు ప్రధానులు అభివాదం చేశారు. తర్వాత ఇద్దరూ కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. అనంతరం మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత ప్రత్యేక గ్యాలరీలో మ్యాచ్‎ను వీక్షించారు.

Related Posts

Latest News Updates