క్షమించండి.. అని మోకాళ్ల మీద వంగి క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో తాను ప్రసంగించలేకపోతున్నానని, ప్రజలందరూ క్షమించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ శుక్రవారం రాజస్థాన్ లో పర్యటించారు. షెడ్యూల్ ప్రకారం అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించాలి. కానీ.. ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

 

”క్షమించండి. నేను ఇక్కడి రావడం ఆలస్యమైంది. రాత్రి 10 దాటింది. నేనూ నిబంధనలు తప్పక పాటించాలని నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అందుకే మీ దగ్గర మాట్లాడలేకపోతున్నా.. క్షమించండి.. మీ ప్రేమాభిమానాల కోసం మళ్లీ ఇక్కడి వస్తా… మీకు మాట ఇస్తున్నా” అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. చివరగా.. వేదికపై మోకాళ్ల మీద వంగి.. సభికులకు నమస్కరించారు. దీనిని బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్విట్టర్ లో షేర్ చేశారు.

 

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్