సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షలు ప్రకటించారు. గాయపడిన వారికి 50, 000 పరిహారం ఇస్తామని మోదీ ప్రకటించారు.
సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం దగ్గర్లో వున్న రూబీ లగ్జరీ ప్రైడ్ హోటల్ లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 8 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ-స్కూటర్ షోరూమ్‌లోని బ్యాటరీలు పేలడంతో ఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.