మోదీని హత్య చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర… ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు

ఎన్ఐఏ తన దర్యాప్తులో పెద్ద విషయాన్నే నిగ్గు తేల్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందన్న విషయాన్ని ఎన్ఐఏ తన దర్యాప్తుల్లో బయట పెట్టింది. ఈ యేడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలోనే ప్రధాని మోదీని హత్య చేసేందుకు పీఎఫ్ఐ ప్రయత్నం చేసిందని, అయితే.. ఆ సంస్థ విఫలమైందని ఎన్ఐఏ పేర్కొంది. ప్రధానిపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా పీఎఫ్ఐ కొందరికి శిక్షణ కూడా ఇచ్చిందని పేర్కొంది. ఇక… ప్రధాని మోదీతో పాటు యూపీలోని పలువురు ప్రముఖలను హత మార్చేందుకు మారణాయుధాలను కూడా సమకూర్చుకుందని ఎన్ఐఏ తన దర్యాప్తులో పేర్కొంది. ఇక… మోదీని హత మార్చేందుకు పురమాయించిన వ్యక్తుల అంకౌట్లలోకి పీఎఫ్ఐ 120 కోట్లను కూడా డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఇక…. ఈ సంచలన విషయం బయటపడటంతో ఎన్ఐఏ మరింత అప్రమత్తమైంది. పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలపై మరింత ద్రుష్టి పెట్టింది. వారి కార్యకలాపాలపై దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు చేసింది. 106 మందిని అరెస్ట్ చేసింది. వీరందరు కూడా ఉగ్రవాద సంస్థలకు టెర్రర్ ఫండింగ్ చేస్తున్నారని, ఎన్ఐఏ గుర్తించింది.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్