ప్రముఖ పెన్నుల తయారీ కంపెనీ రొటోమ్యాక్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ, దాని డైరెక్టర్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును 750 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ అభియోగం మోపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియానికి ‘రొటో మ్యాక్ గ్లోబల్’ కంపెనీ దాదాపు రూ.2,919 కోట్ల రుణ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇందులో 23 శాతం లోన్స్ ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కంపెనీ తీసుకుందని సీబీఐ పేర్కొంది.
అందుకే కంపెనీ డైరెక్టర్లైన సాధనా కొఠారి, రాహుల్ కొఠారిపై ఐపీసీ 120 బీ, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రొటొమ్యాక్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి. 1992 లో యూపీలోని కాన్పూర్ కేంద్రం రొటోమాక్ పెన్నుల ఫ్యాక్టరీ ప్రారంభమైంది. దాదాపు 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ సంస్థ ఆర్జించింది. దీంతో ఇండియాస్ పెన్ కింగ్ అని డైరెక్టర్ విక్రమ్ కొఠారికి బిరుదు వచ్చింది.