దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 అనేది గొప్ప స్వాతంత్ర దినోత్సవమని అభివర్ణించారు. చరిత్ర లేని వారు వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ను టీజీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎగరే విధంగా జెండా రూపొందిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక నిర్వహించడం లేదని, కేవలం టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలోనే ఉత్సవాలు చేశారని విమర్శించారు.
కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చిందా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి బీజేపీ ఈ ఉత్సవాలను వాడుకుంటోందని మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభకు 1500 మంది కూడా లేరని రేవంత్ ఎద్దేవా చేశారు. ఎందుకంటే.. బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. గుజరాత్ జునేఘడ్ లో ఎందుకు వజ్రోత్సవాలు చేయడం లేదని, కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తున్నారని రేవంత్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లో రాజు నుంచి జునేగఢ్ కు కూడా స్వాతంత్రం వచ్చిందని, అమితత్ షా అక్కడికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. బీజేపీ ఇన్ని సంవత్సరాల్లో వజ్రోత్సవాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.