వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగుతుందన్న వార్తలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ తో పొత్తు అనేది కలలో కూడా జరగని పని అన్నారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై… ఈ ఇంటి కాకి ఆ ఇంటిపై వాలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ వాలితే.. చంపేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ తప్పులను మోసేందుకు తాము సిద్ధంగా లేమని, రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ లేకుండా కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు.

 

తమను కొట్టడానికి బీజేపీని బాగా ప్రోత్సహించారని, అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందని విమర్శించారు. టీఆర్ఎస్ తో పొత్తు వుండని వరంగల్ వేదికగా రాహుల్ కూడా ప్రకటించారని గుర్తు చేశారు. మరోవైపు భారత్ జోడో యాత్రలో వున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ను రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. తెలంగాణలో యాత్ర గురించి చర్చించారు. బహిరంగ సభ ఎక్కడ పెట్టాలన్నది కూడా చర్చించుకున్నారు.