రాక్షస పాలన అంతం చేయడమే ‘వారాహి’ లక్ష్యం… పవన్ కల్యాణ్ ప్రకటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కొండగట్టు అంజన్న, ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో కూడా ప్రచార రథం వారాహికి పవన్ పూజలు నిర్వహించారు. విజయవాడకి వచ్చిన పవన్ కి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీలో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని పవన్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో వుండాలని ఆకాంక్షించారు. మరోవైపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. ప్రచార రథానికి పూజల చేసేందుకే ఇంద్రకీలాద్రికి వచ్చినట్లు పవన్ పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను దుర్గమ్మ గమనిస్తోందని పవన్ అన్నారు. అయితే.. పుణ్య క్షేత్రం కాబట్టి, ఇంతకు మించి రాజకీయాలపై మాట్లాడనని పవన్ అన్నారు. పవన్ పర్యటన సందర్భంగా ఇంద్రకీలాద్రి మొత్తం పవన్ అభిమానులు, కార్యకర్తల మయం అయిపోయింది. వాహనం వారాహి వెంబడి చాలా మంది తరలి వచ్చారు. దీంతో వాహనం ఎక్కి, గధ పట్టుకొని పవన్ అభిమానులకు, ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత పవన్ మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.

జననసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఆయన.. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి అర్చకులతో కలసి ప్రత్యేకంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇవి వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గం ద్వారా జనసేన పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానానికి బయల్దేరారు. కొండగట్టుకు చేరుకున్న జనసేనానికి అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Related Posts

Latest News Updates