ఈ నెల 26 ‘హరిహర వీరమల్లు’ టీజర్ రిలీజ్…

పవన్ కల్యాణ్ నటించి, తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే… మూవీ మేకర్స్ బిగ్ అప్ డేట్ ఇచ్చేశారు. ఈ నెల 26 న హరిహర వీరమల్లు టీజర్ ను విడుదల చేస్తామని ప్రొడ్యూసర్ రత్నం ప్రకటించినట్లు ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై రత్నం క్లారిటీ ఇవ్వాల్సి వుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. వేసవి కాలంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే రిలీజ్ కావాల్సి వుంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో రిలీజ్ వాయిదాపడుతూ వస్తోంది. వీరమల్లు మూవీ కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదని.. హిందీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని కంటెంట్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఇక పవన్ క్రేజ్‌ను ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మరింత పెంచుతుందని ప్రొడ్యూసర్ కొన్ని రోజుల క్రిందటే అన్నారు.

Related Posts

Latest News Updates