‘హరి హరి వీరమల్లు’ పవన్ కళ్యాణ్ బర్త్ డే పోస్టర్

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హరి వీరమల్లు సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఏం ఎం రత్నం నిర్మిస్తోండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. ఓ పక్క కరోనా, మరో పక్క రాజకీయాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ నెలలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించేట్టు న్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని నేడు పోస్టర్ తో ఓ అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో పెద్ద యుద్దం చేయడానికి వెళ్తోన్నట్టుంది. అలా స్వారీ చేసుకుంటూ వెళ్తోన్న లుక్కులో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో కచ్చితంగా యాక్షన్ సీక్వెన్స్ ఇంకో లెవెల్లో ఉండేలా క్రిష్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అసలే ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్‌లో క్రిష్ ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఈ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ ఒకటి రానుందట. రేపు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఈ మూవీ నుంచి గ్లింప్స్ రానుంది. మొత్తానికి ఈ పోస్టర్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రేపటి వీడియోలో పవన్ కళ్యాణ్ చేసే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తే అభిమానుల కడుపునిండిపోతోందేమో చూడాలి. హరి హర వీరమల్లు నుంచి మాత్రమే కాకుండా.. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు కూడా ఏమైనా వస్తాయేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హరిశ్ శంకర్ చిత్రం, సముద్రఖని తీయబోతోన్న సినిమాలకు సంబంధించిన ప్రకటన ఇంత వరకు జరగలేదు.

https://twitter.com/DirKrish/status/1565296978048991237

Related Posts

Latest News Updates