రోడ్లు వేయరు కానీ… విస్తరణ కావాలా? ప్రభుత్వంపై పవన్ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామానికి బయల్దేరారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే గ్రామంలో 53 ఇళ్లు, ప్రవాహా గోడలను ప్రభుత్వం కూల్చేయడంపై పవన్ తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. దీంతో అక్కడి వెళ్లి… నేరుగా బాధితులతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పవన్ నేడు ఇప్పటం గ్రామానికి బయల్దేరారు. అయితే… ఇప్పటం వెళ్తున్న పవన్ ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కారును వదిలేసి, నడుచుకుంటూ ముందుకు సాగారు. అనంతరం కారు పైకి ఎక్కి ఇప్పటం పయనమయ్యారు.

 

ఇప్పటం చేరుకున్న పవన్ కు జనసేన కార్యకర్తలు స్వాగతం పలికారు. కూల్చేసిన ఇళ్లను జనసేనాని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి బాధితులు పవన్ తో మాట్లాడారు. ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించం లేదని, తమ పార్టీ సభకు స్థలం ఇచ్చారన్న కుట్రతోనే వారిని ఇబ్బందులు చేస్తున్నారని ఆరోపించారు. తామేమైనా గుండాలమా? ఎందుకు ఆపారు? అంటూ ఫైర్ అయ్యారు. గుంతలు పూడ్చలేరు… రోడ్లు వేయరు కానీ… విస్తరణ కావాలా? అంటూ ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారు, ఒక్క వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా వదిలేశారు ఎందుకు? అని సూటిగా నిలదీశారు.

 

Related Posts

Latest News Updates