పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 న ప్రారంభమై… డిసెంబర్ 29 వరకూ కొనసాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మొత్తం 17 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లుల, అంశాలపై చర్చిస్తామని ప్రకటించారు.
ఇక… ముందస్తు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2023-2024 కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. ఈ సమావేశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారు. పరిశ్రమల ఛాంబర్లు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.
Winter Session, 2022 of Parliament will commence from 7 December & continue till 29th December having 17 sittings spread over 23 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business & other items during the session. Looking forward for constructive debate. pic.twitter.com/4LnYvEaUmd
— Pralhad Joshi (@JoshiPralhad) November 18, 2022












