పంజాబ్ దిగ్గజం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత… గురువారం అంత్యక్రియలు

పంజాబ్ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి, శిరోమణీ అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో వారం క్రితమే ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించి, చికిత్సఅందిస్తున్నారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖబీర్ బాదల్ ప్రకటించారు. మరోవైపు బుధవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ పార్టీ ప్రధాన కార్యాలయంలో బాదల్ భౌతిక కాయాన్ని కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం వుంచుతామని ప్రకటించారు. ఆ తర్వాత బాదల్ సొంత గ్రామానికి తీసుకెళ్లి, గురువారం అంత్యక్రియలు జరుగుతాయి. బాదల్ మరణంతో పంజాబ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

 

బాదల్ 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్ కి 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించారు. అతి చిన్న వయస్సులోనే సర్పంచి పదవి చేపట్టి, రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత బ్లాక్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1957 లో కాంగ్రెస్ పక్షాన మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1969 లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1970 లో మొదటి సారిగా పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అత్యంత పిన్న వయస్సులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎన్డీయే ప్రభుత్వంలోనూ పనిచేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా, నీటిపారుదల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Related Posts

Latest News Updates