ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జైద్ ఖాన్ మాట్లాడుతూ .. నన్ను ఆశీర్వదించడానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన రవిచంద్రన్ గారు, అర్బాజ్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. చాలా అనందంగా వుంది. ఈ ప్రయాణంలో చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను నడుడిగా పరిచయం చేస్తున్న నిర్మాత తిలకరాజ్ బల్లాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నటుడు కావాలనే నా కల ఆయన వలనే నెరవేరింది. దర్శకుడు జయతీర్థ గారికి కృతజ్ఞతలు. మంచి టీమ్ వర్క్ తో చేసిన చిత్రమిది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ప్రేక్షకులకు వినోదం పంచుతానని మాటిస్తున్నాను. పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలలో ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. రవిచంద్రన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి జైద్ ఖాన్ కు స్వాగతం. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకు అనుభవం వున్న నటుడిలా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు జైద్. ట్రైలర్ చాలా ఎక్సయిట్ గా వుంది. చాలా క్యూరీయాసిటీని పెంచింది. బనారస్ యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విశేష్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించి జైద్ కి గొప్ప ఆరంభం ఇవ్వాలి” అని కోరారు
అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతన్న జైద్ కి నా బెస్ట్ విశేష్. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్సయిటింగా వుంది. టైం ట్రావెల్ ఎలిమెంట్ చాలా క్యూరీయాసిటీని పెంచింది. ఈ సినిమా కోసం బనారస్ టీమ్ ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి” అని కోరారు సతీష్ వర్మ మాట్లాడుతూ.. జైద్ నాన్నగారు నాకు మంచి స్నేహితులు. ఈ సినిమాని తెలుగు విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుంది. బలమైన కంటెంట్ వున్న సినిమా ఇది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో భాగం కావడం మరింత ఆనందంగా వుంది. జైద్, బనారస్ టీంకు ఆల్ ది బెస్ట్” తెలిపారు.