పూంఛ్ ప్రమాదం… ప్రమాదం కాదు.. ఉగ్రదాడే : ప్రకటించిన ఆర్మీ

జమ్మూ కశ్మీర్ పూంఛ్ లో జరిగింది అగ్నిప్రమాదం కాదని, అది ఉగ్రదాడి అని ఆర్మీ నిర్ధారణ చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణంచారని ప్రకటించింది. జమ్మూ పూంఛ్ సెక్టార్ దగ్గర జవాన్లు వెళ్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయని మొదట్లో వార్త వచ్చింది. కానీ… అది ప్రమాదం కాదని, ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారని, అందుకే మంటలు చెలరేగి జవాన్లు అమరులయ్యారని ఆర్మీ ప్రకటించింది.

 

ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికే వెళ్తున్న క్రమంలోనే జవాన్లపై ఉగ్రవాదులు దాడికి దిగారని పేర్కొన్నారు. వర్షం పడుతుండటంతో ట్రక్కు నెమ్మదిగా వెళ్లోందని, దీనిని ఉగ్రవాదులు ఆసరాగా చేసుకొని, గ్రనేడ్లు విసిరారని ప్రకటించారు. తొలుత ఇది పిడుగు అనుకున్నామని, కానీ… దర్యాప్తు తర్వాత ఉగ్రదాడి అన్న నిర్ధారణకు వచ్చామని ఆర్మీ పేర్కొంది.

జమ్మూ కశ్యీర్ లోని పూంచ్ లో హైఅలర్ట్ ప్రకటించారు ఆర్మీ ఆధికారులు. ఉగ్రదాడి జరిగిన స్థలం సహా.. పూంచ్ పరిసర ప్రాంతాలన్నీ పారామిలటరీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆర్మీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, ఈ దాడిని తామే చేసినట్లు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు జైషే మహ్మద్ సంస్థతో అనుబంధాలు ఉన్నాయి.

 

అయితే, ఘటనా స్థలంలో చైనాకు సంబంధించిన బుల్లెట్లను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. దాంతో ఉగ్ర దాడిలో చైనా హస్థం ఉందా? ఉగ్ర వాదులతో చేతులు కలిపే చైనా ఈ దుస్సాహసానికి పాల్పడిందా అన్న కోణంలో ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Related Posts

Latest News Updates