60 లక్షల దోమ తెరల్ని భారత్ నుంచి కొనుగోలు చేయనున్న పాక్

భయానక వరదలతో పోరాడుతున్న దాయాది పాకిస్తాన్ భారత్ సహాయం కోరింది. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు భారీగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత్ నుంచి 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికి పాక్ ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఫండ్ కింద అందించిన నిధులతో పాక్ ఈ దోమ తెరలను కొనుగోలు చేస్తోంది. వీలైనంత త్వరగా భారత్ నుంచి దోమ తెరలను కొనుగోలు చేసుకోవాలని పాక్ ప్రయత్నంలో వుంది. వచ్చే నెలలో వాఘా సరిహద్దు ద్వారా దోమ తెరలు పాక్ కు చేరనున్నాయి. పాకిస్తాన్ లోని 32 ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా విపరీతంగా ప్రబలిపోయింది. దాదాపు 27 లక్షల కేసులు బయటపడినట్లు సమాచారం.

 

జూన్ నుంచి పాకిస్తాన్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. మూడొంతు భూభాగంలో ఒక వంతు నీటితో నిండిపోయింది. వంతెనలు, రోడ్లు, కరెంట్.. ఇలా అన్నింటా అవస్థలు పడుతోంది. సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలైతే ఘోరంగా దెబ్బతిన్నాయి. 2023 జనవరి వరకు పాకిస్తాన్ లో 32 జిల్లాల్లో భారీగా మలేరియా కేసులు నమోదు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Related Posts

Latest News Updates