200 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తెస్తున్న పాక్ పడవ స్వాధీనం

దాదాపు 200 కోట్ల విలువైన, 40 కేజీల మాదక ద్రవ్యాలను ఇండియన్ కోస్ట్ గార్డు, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తీసుకొస్తున్న పాకిస్థానీ పడవను ఈ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జలాల్లో ఆరు మైళ్ళ లోపల ఈ పడవను స్వాధీనం చేసుకున్నాయి. దీనిలో రూ.200 కోట్ల విలువైన దాదాపు 40 కేజీల మాదక ద్రవ్యాలు ఉన్నాయి. గుజరాత్ తీరంలో జఖావూ నుంచి 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పాకిస్థానీ పడవ అల్ తయ్యసను స్వాధీనం చేసుకున్నామని కోస్ట్ గార్డ్ పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు పాల్గొన్నాయి. తదుపరి దర్యాప్తు కోసం ఈ పడవను, దీనిలోని ఆరుగురు సిబ్బందిని జఖావూ తీసుకెళ్లారు.

Related Posts

Latest News Updates