వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ ని మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్  మాట్లాడుతూ  తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధే బీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచిందని కొనియాడారు. మీకు అన్ని విధాలుగా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ను మీ ద్వారా స్థానిక ప్రజలకు అందించాలని సూచించారు. మునుపెన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుని వలె పని చేయాలని, మనం చేసిన, చేస్తున్న అభివృద్ధిని వారికి తెలియచెప్పాలని కోరారు.