యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యానర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్స్ మిథిలా పాల్కర్, ఆశా భట్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… హీరో మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా నుంచి సపోర్ట్ చేస్తోన్న అందరికీ థాంక్స్. ఓరి దేవుడా మూవీ మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఫెస్టివల్ మూవీ. వెంకటేష్‌గారు మాతో పాటు ఉన్నారు. ఆయకు స్పెషల్ థాంక్స్. ఎంటర్‌టైనింగ్ మూవీ. ప్రేక్షకులే కాదు.. విమర్శకులకు కూడా సినిమా బాగా నచ్చింది. ఆడియెన్స్‌తో సినిమా చూసినప్పుడు క్రేజీ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పాలి. ఇంకా సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వండర్స్ చేస్తుందని భావిస్తున్నాను. టీమ్ అందరం ఫ్యామిలీలా కలిసి ట్రావెల్ చేశాం. మళ్లీ అందరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం. లియోన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పివిపిగారికి థాంక్స్. సినిమాలోని పాటలను అందరూ ఎంజాయ్ చేస్తారు. వంశీ కాకగారికి థాంక్స్. నా బ్యాక్ బోన్‌లా నిలిచిన ఆదిత్యకి థాంక్స్. ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీమ్‌కి థాంక్స్. అశ్వత్, నా హీరోయిన్స్, వెంకటేష్ కాకమాను సహా అందరూ వర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ మరచిపోలేను’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక మాట్లాడుతూ ‘‘అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. విశ్వక్‌ని దిల్‌రాజు ఆఫీసులో చూసినప్పుడు తను భయపడుతూ కనిపించాడు. తన పేరు కూడా అప్పుడు తెలియదు. వన్ ఇయర్ తర్వాత ఫలక్‌నుమాదాస్ వచ్చింది. వెళ్లిపోమాకే సినిమా నుంచి ఇప్పటి వరకు నా రెమ్యునరేషన్ సేమ్. కానీ.. విశ్వక్ మాత్రం ఎవరూ గుర్తు పట్టని స్థాయి నుంచి పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. చాలా సంతోషంగా ఉంది. ఎవడి లైఫ్‌కి వాడే హీరో. నా హీరో విశ్వక్ సేన్. తన గ్రోత్ సినిమా ప్రతీసారి నాకు అదే అనిపిస్తుంది. ఓరి దేవుడా ప్లెజెంట్ లవ్ స్టోరి. సినిమా చూసిన అందరూ ఎంజాయ్ చేస్తారు. పివిపిగారు ఈ సినిమా కోసం రెండేళ్ల పైగానే ట్రావెల్ అయ్యారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బావుందనే చెబుతున్నారు. మా కోసం రాజమండ్రి వచ్చి ఈవెంట్‌ను సక్సెస్ చేసిన రామ్ చరణ్‌గారికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. అలాగే సినిమాలో స్పెషల్ రోల్స్ చేసిన వెంకటేష్‌గారికి థాంక్యూ వెరీ మచ్’’ అన్నారు. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ ‘‘మా మాస్ కా దాస్ విశ్వక్, హీరోయిన్స్ మిథిలా పాల్కర్, ఆశా భట్‌లకు థాంక్స్. గ్రేట్ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే తొలిరోజున థియేటర్స్‌లో తొలి షోను చూడటం, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. విడుదలైన అన్ని చోట్ల యూత్ ప్రేక్షకులే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఆదరిస్తున్నారు. చూసిన ప్రతీసారి సినిమాను కొత్తగా ఫీల్ అవుతారు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వస్తున్న రెస్పాన్స్ చూసి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. తమిళంలో మంచి ఆఫర్స్ వచ్చినా కొత్త ఫీల్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాను. పివిపి సినిమా, విశ్వక్, మిథిల, ఆశ ఎక్స్‌ట్రార్డినరీగా పిల్లర్స్‌గా నిలిచారు. విక్టరీ వెంకటేష్‌గారికి చాలా పెద్ద థాంక్స్. ఆయన క్యారెక్టర్‌ను క్యారీ చేసిన తీరు, దానికి ఆడియెన్స్ ఇస్తోన్న రెస్పాన్స్ బ్రిలియంట్. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ఆశా భట్ మాట్లాడుతూ ‘‘ఓరి దేవుడా సినిమాకు వచ్చిన.. వస్తోన్న రెస్పాన్స్, కలెక్షన్స్ చూసి సంతోషంగా ఉంది. సినిమా కోసం పడిన కష్టం మరచిపోయాం. పివిపిగారు, వంశీగారు, విశ్వక్, అశ్వత్ సహా అందరికీ పేరు పేరునా థాంక్స్. సినిమాను అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
మిథిలా పాల్కర్ మాట్లాడుతూ ‘‘ఓరి దేవుడాతో సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. కొత్త ఎక్స్‌పీరియెన్స్. నా తెలుగు ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేయటానికి ఇంత కంటే గొప్ప జర్నీ ఉండదని భావిస్తున్నాను. టాలీవుడ్‌లోకి నన్ను తీసుకొచ్చిన అశ్వత్‌కి థాంక్స్. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. మీతో పాటు మీ ఫ్యామిలీతో కలిసి సినిమాను చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ మాట్లాడుతూ ‘‘‘ఓరి దేవుడా’ చాలా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా రిలీజ్ కంటే ముందు వచ్చిన పాటలను ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. పాటలకు వచ్చిన స్పందన చూసి సినిమాకు ఎలా రియాక్ట్ అవుతారోనని ఆసక్తిగా ఎదురు చూశాం. మేం ఊహించిన దానికంటే మంచిగా రియాక్ట్ అయ్యారు. మాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు’’ అన్నారు. నటుడు వెంకటేష్ కాకమాను మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగ సందర్భంగా ‘ఓరి దేవుడా’ రూపంలో ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. మేం ఎక్స్‌పెక్ట్ చేసిన దాని కంటే సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. విశ్వక్ సేన్, నేను, మిథిలా పాల్కర్, ఆశా భట్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. దానికి తగ్గట్టు లియోన్ మంచి మ్యూజిక్ తోడైంది. అశ్విత్ సినిమాను చక్కగా డైరెక్ట్ చేశాడు. మీ ఫ్యామిలీస్‌తో సినిమాను చూసి ఆశీర్వదించండి’’ అన్నారు.