‘గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి…’ జాగ్రత్తగా చూసుకుంటాను అని తన ప్రేయసి బుజ్జమ్మకి చెబుతున్నారు హీరో విశ్వక్ సేన్. ఇంతకీ ఆ బుజ్జమ్మ ఎవరు.. ఆమెను విశ్వక్ సేన్ ఎందుకు ప్రేమించాడు.. అనే విషయాలు తెలియాలంటే మాత్రం ‘ఓరి దేవుడా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. రీసెంట్గా ఈ రొమాంటిక్ కామెడి నుంచి విడుదలైన ట్రైలర్‌ను చూసిన వారందరూ ఎక్స్ట్రార్డినరీ అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని అందరిలో మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ‘గుండెల్లోన..’ అనే బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కోలీవుడ్ యంగ్ మ్యూజికల్ సెన్సేషనల్ అనిరుధ్ ఈ పాటను పాడటం విశేషం. ట్యూన్, దానికి తగ్గ లిరిక్స్‌తో పాట వినసొంపుగా ఉంది. అనిరుధ్ తనదైన వాయిస్‌తో ఈ పాటను పాడి దానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు. కాసర్ల శ్యామ్ ప్రేయసిపై ప్రియుడు ప్రేమను ఎంత గొప్పగా చెప్పొచ్చో లిరిక్స్ ద్వారా చూపించారు. పాటలో విశ్వక్ సేన్, ఆశా భట్ మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈ వాన పాట, అందుకు తగ్గ ఫుట్ ట్యాపింగ్ మూమెంట్స్‌తో చూడటానికి కన్నుల పండుగలా అనిపిస్తుంది. స్టార్ హీరో వెంకటేష్ ‘ఓరి దేవడా’ చిత్రంలో స్టైలిష్ దేవుడిలా కనిపించనున్నారు. విజయ్ ముక్తవరపు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమా టెక్నికల్ టీమ్‌లో విదు అయ్యన్న కూడా భాగమై ఉన్నారు. రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం దీపావళి సందర్భంగ అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.
https://www.youtube.com/watch?v=UCF6QXrg00c