19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆపరేషన్ ‘మేఘచక్ర’… విరుచుకుపడుతున్న సీబీఐ

తెలుగు రాష్ట్రాలతో దేశ వ్యాప్తంగా నేడు సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ ను గుర్తించేందుకు, ఆ కంటెంట్ తో మైనర్లపై బ్లాక్ మెయిల్ కు దిగుతున్న ముఠాలపై విరుచుకుపింది. ఈ ఆపరేషన్ కు సీబీఐ ”మేఘచక్ర” అని పేరు పెట్టింది. ”మేఘచక్ర” కింద సీబీఐ ముమ్మరంగా దాడులు చేస్తోంది. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 56 చోట్ల సీబీఐ దాడులు కొనసాగించింది.

 

న్యూజిలాండ్ లోని ఇంటర్ పోల్ యూనిట్ సింగపూర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ ఈ దాడులు చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఆన్ లైన్ లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ ను వైరల్ చేయడంతో పాటు, వారిని లైంగికంగా, శారీరకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని పట్టుకునేందుకే సీబీఐ ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ ను చేపట్టింది.

Related Posts

Latest News Updates