హిమాచల్ హస్తగతం… చివరికి కాంగ్రెస్ నే వరించిన విజయం

హోరాహోరీగా సాగిన హిమాచల్ పోరులో విజయం కాంగ్రెస్ వశమైంది. మొత్తం 68 స్థానాలకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 35 ను కాంగ్రెస్ దాటేసింది. ఇప్పటికే 26 స్థానాల్లో విజయం సాధించగా… 4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక.. బీజేపీ 23 సీట్లు గెలిచి, 2 స్థానాల్లో ముందంజలో వుంది. ఇతరులు 3 సీట్లలో విజయం సాధించారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడింది. చివరికి హిమాచల్ కాంగ్రెస్ వశమైంది.

ఇక… తాము బీజేపీ ఆపరేషన్ కు భయపడమని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను చండీగఢ్ కి తరలిస్తామని తెలిపారు. ఇక.. సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఇక… ఎమ్మెల్యేలను రాజస్థాన్ కి కూడా తరలిస్తారని వార్తలొస్తున్నాయి.

పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పుపై ప్రతిభా వీరభద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజాతీర్పు ఉందని, భయపడే అవసరమే లేదని అన్నారు. ఎమ్మెల్యేలందరినీ ఛండీగడ్‌లో కానీ, రాష్ట్రంలో కానీ కలుసుకుంటామని, గెలిచిన అభ్యర్థులంతా తమతోనే ఉంటారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌కు మోదీ పదేపదే వచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని, రాష్ట్రంలో పార్టీ ఓడిపోతుందనే విషయం బీజేపీకి తెలిసినందునే కాలికిబలపం కట్టుకుని మోదీ తిరిగారని ఆమె అన్నారు.

Related Posts

Latest News Updates