హిమాచల్ లో హోరాహోరీ…. ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలిస్తున్న కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో లీడ్ లో వున్నాయి. దీంతో ఇరు పార్టీలూ తమ తమ ఆధిక్యాన్ని ప్రదర్శించే పనిలో వున్నాయి. ఇంత టఫ్ ఫైట్ వుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. బీజేపీ తన ఆకర్ష్ విధానం ద్వారా ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవచ్చన్న ముందస్తు వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేలందర్నీ రాజస్థాన్ కు తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దగ్గరుండి చూసుకుంటున్నారు.

 

ఈ మధ్యాహ్నం ఆమె సిమ్లాకు చేరుకోనున్నారు. ఇక… ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలించే బాధ్యతను కాంగ్రెస్ ఇద్దరు నేతలకి అప్పజెప్పింది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగేల్, పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపేందర్ హుడాకు అప్పగించారు. హిమాచల్ లో మొత్తం 68 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత ఫలితాల ప్రకారం కాంగ్రెస్, బీజేపీ నువ్వా, నేనా అన్నట్లు నడుస్తోంది.

Related Posts

Latest News Updates