ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కి జైలులో మసాజ్… బయటికి వచ్చిన వీడియో

ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు తిహార్ జైలులో మసాజ్ చేస్తున్న సీసీటీవీ వీడియోలు బయటకు వచ్చాయి. జైలులో నిబంళధనలకు విరుద్ధంగా సకల సదుపాయాలు అందుతున్నాయని పలువురు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ సీసీటీవీలో మంత్రి సత్యేంద్ర జైన్ కు ఓ వ్యక్తి మసాజ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మంత్రి కాళ్లకు నూనె రాసి మసాజ్ చేశాడు. జైలులో జైన్ కు సకల సదుపాయాలు, వీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోందని ఈ మధ్య బాగానే విమర్శలు వచ్చాయి. అధికారులను కూడా డిస్మిస్ చేశారు.

 

అయితే… ఈ ఫుటేజీలపై బీజేపీ మండిపడింది. జైలులో వీవీఐపీ సదుపాయాలు అందుతున్నాయని, అలాంటి మంత్రికి కేజ్రీవాల్ మద్దతు పలుకుతారా? అంటూ మండిపడింది. ఆయన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆప్ అవినీతి, వీవీఐపీ కల్చర్ ను రూపు మాపడానికి పార్టీని ఏర్పాటు చేశారని గౌరవ్ భాటియా మండిపడ్డారు.

 

అయితే… బీజేపీ ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. మంత్రి సత్యేంద్ర జైన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే సదుపాయాలు కల్పించాలని కోర్టు అనుమతిని ఇచ్చిందని గుర్తు చేశారు. అందులో భాగమే ఆక్యుప్రేజర్ అని ఆప్ వివరించింది.

Related Posts

Latest News Updates