రాధికా కుమారస్వామి పుట్టిన రోజు సందర్భంగా ‘అజాగ్రత్త’ పోస్టర్, ‘భైరా దేవీ’ టీజర్ విడుదల

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి, కన్నడ పాపులర్ నటి రాధికా కుమారస్వామి పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొన్ని సినిమాల అప్డేట్లు వచ్చాయి. అజాగ్రత్త, భైరాదేవీ చిత్రాల నుంచి అప్డేట్లను మేకర్లు రిలీజ్ చేశారు.

అజాగ్రత్త సినిమాను శశిధర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్‌లో రవి రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ది షాడోస్ బిహెండ్ ది కర్మ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌‌‌లో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు సైతం నటిస్తున్నారు. వారి పేర్లు త్వరలోనే ప్రకటించబోతున్నారు.

రాధికా కుమారస్వామి బర్త్ డే సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఏడు భాషల్లో రిలీజ్ చేశారు. దీపావళికి తగ్గట్టుగానే ఈ పోస్టర్ ఉంది. చీరకట్టులో రాధిక, వెనకాల ఆ దీపాలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది.

శ్రేయాస్ తల్పడే, సునీల్, రావు రమేష్, ఆదిత్య మీనన్, దేవ్ రాజ్, వినయ ప్రసాద్, శ్రావణ్ ఇలా ఇంకెంతో మంది దక్షిణాది తారలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

భైరా దేవీ టీజర్ విషయానికి వస్తే.. కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడే అఘోరగా రాధిక కనిపించారు. పోలీస్ కారెక్టర్‌లో రమేష్ అరవింద్ నటించారు. ఈ మూవీని రాధిక తన స్వంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. శ్రీ జై ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్, యాదవ్‌లు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. రంగయాణ రఘు, రవి శంకర్ (బొమ్మాలి), స్కంద అశోక్, అను ముఖర్జీ, మాళవిక అవినాష్, సుచేంద్ర ప్రసాద్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

జే.ఎస్.వాలి సినిమాటోగ్రఫర్‌గా, కేకే సెంథిల్ ప్రసాథ్ సంగీత దర్శకుడిగా, సీ రవిచంద్రన్ ఎడిటర్‌గా, కే రవి వర్మ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వారణాసి, కాశీ, హరిద్వార్, హైద్రాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాల్లో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Related Posts

Latest News Updates