చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం “షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను మంత్రి సీతక్క చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
మంత్రి సీతక్క మాట్లాడుతూ – తరతరాలుగా మహిళ ఈ సమాజంలో అణిచివేతకు గురవుతోంది. వారికంటూ ఉన్న ప్రత్యేకమైన రోజు ఈ ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలు పోరాడి సాధించుకున్న ఈ రోజున మహిళా గీత రచయిత చైతన్య పింగళి రాసిన ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మధ్య తరగతి మనుషుల జీవితాలను ప్రతిబింబించే సినిమా “షరతులు వర్తిసాయి”. మన గ్రామాల్లో నివసించే మధ్య తరగతి మనుషుల జీవితాల్లోని కథలు, వెతలు, భావోద్వేగాలన్నీ ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా హీరో చైతన్య, ఇతర నటీనటులకు, దర్శకుడు కుమారస్వామి, మామిడి హరికృష్ణ, లిరిసిస్ట్ చైతన్య పింగళి…అందరికీ నా శుభాకాంక్షలు. “షరతులు వర్తిసాయి” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అని చెప్పారు.