అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కేస్ నం. 15’. బీజీ వెంచర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో తడకల వంకర్ రాజేశ్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తడకల వంకర్ రాజేశ్ మాట్లాడుతూ – ‘‘సస్ప
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం ఇది. బలమైన కథాశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అజయ్‌కి మంచి పేరు వస్తుంది. రవిక్రాశ్ ఓ డిఫరెంట్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఈ చిత్రానికి జాన్ మంచి సంగీతం ఇచ్చారు. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాటకు మంచి స్పందన లభించింది. ఆనం వెంకట్‌గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉంటుంది. నా అభివృద్ధికి అండగా నిలబడిన సి. కల్యాణ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ చిత్రానికి రచన–దర్శకత్వం: రాజేశ్ తడకల, సంగీతం: జాన్, పాటలు: బాలకృష్ణ, కెమెరా: ఆనం వెంకట్, ఎడిటింగ్: ఆర్‌కె స్వామి, ఆర్ట్: మధు రెబ్బా