అబార్షన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్ట పరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు వుందని తేల్చి చెప్పింది. వివాహితలు, అవివాహితలు అంటూ తేడా చూపించవద్దని, అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. పెళ్లితో అసలు సంబంధమే లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు వుందని తెలిపింది. పెళ్లి కానివారు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం సుప్రీం అబార్షన్ కు అనుమతినిచ్చింది. ఇక బలవంతపు గర్భధారణ కూడా అత్యాచారమేనని, భర్త బలవంతం చేసినా అత్యాచారమే అవుతుందని పేర్కొంది.
ఈ దేశాల్లో అబార్షన్ కు అస్సలు ఛాన్సే లేదు… అయితే.. షరతులు వుంటాయి..
ఇక… ఆయా దేశాల్లో అబార్షన్ విషయంలో ఒక్కో రకంగా చట్టాలున్నాయి. కొన్ని దేశాల్లో నిర్దేశించిన పరిమితులకు మించి, గర్బస్రావం జరిగితే.. మహిళలు జైలు శిక్ష అనుభవిస్తారు. డొమినికన్ రిపబ్లిక్, నికరాగువా, వాటికన్ సిటీ, మాల్టా వంటి దేశాలలో అస్సలు అబార్షన్లను అనుమతించరు. యూరోపియన్ యూనియన్ లో అబార్షన్ కు అనుమతి వుండదు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిబంధనలు ఇక్కడ వున్నాయి.
నియమాలను ఉల్లంఘిస్తే.. 3 సంవత్సరాల వరకు శిక్ష వుంటుంది. చిలీలో గర్భవతి అయితే.. తప్పనిసరిగా బిడ్డకు జన్మనివ్వాల్సిందే. అబార్షన్ అసాధ్యం. ఐర్లాండ్ లో అబార్షన్ చట్టవిరుద్ధం. మహిళ జీవితానికి ముప్పు వుంటేనే అబార్షన్ కు అనుమతి వుంటుంది. నైజీరియాలో కూడా అంతే. అబార్షన్ కు అనుమతులు వుండవు. ఇరాన్ లో కూడా అబార్షన్ కు అనుమతి వుండదు. మహిళల ప్రాణాలకు ముప్పు వుంటే తప్ప. సౌదీ అరేబియాలో మహిళల ప్రాణాలకు ముప్పు వుంటేనే అనుమతి వుంటుంది.