యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగు లో అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేఖరుల సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది. *శర్వాంద్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం మనసుని హత్తుకునే సినిమా. ఈ సినిమా చుసిన తర్వాత ఇందులో వుండే పాత్రలతో రిలేట్ అవుతాం. కార్తిక్ ఇందులో గొప్ప విషయం చెప్పాడు. నిన్నటి బాధ, రేపటి ఆశ తో బ్రతుకుతుంటాం. కానీ ఈ క్షణాన్ని గుర్తించం. అది గుర్తించినపుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ . అందుకే ఒకే ఒక జీవితం టైటిల్ పెట్టాం. ఒకే ఒక జీవితం మంచి వినోదాత్మక చిత్రం. మదర్ ఎమోషన్ తో పాటు మంచి వినోదం ఇందులో వుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ పాడిన హీరో కార్తి అన్నకి థాంక్స్. ఒక హీరోకి, సినిమాకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ట్రైలర్ ని పోస్ట్ చేసిన ప్రభాస్ అన్నకి కృతజ్ఞతలు. అలాగే ట్రైలర్ ని లాంచ్ చేసిన అనిరుద్ కు థాంక్స్” తెలిపారు.
*అమల అక్కినేని మాట్లాడుతూ.. పదేళ్ళ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా. మంచి కథని తీసుకొచ్చి అందులో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీకార్తిక్ కి థాంక్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభు గారు చాలా ధైర్యంగా మంచి కంటెంట్ ని ఇవ్వాలనే ఉద్దేశం తో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. శర్వానంద్ కి తల్లిగా చేశాను. ఈ సినిమాతో నా మూడో కొడుకు శర్వా అయ్యాడు (నవ్వుతూ). అయితే ఈ సినిమా అంతా తల్లిప్రేమ గురించి కాదు. అమ్మ ఎల్లప్పుడూ ఉండలేదు కదా. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఈ కథలో వున్నాయి. ఈ సినిమా ముగ్గురి జర్నీ గురించి. ఆ ముగ్గురు కాలంతో ఆడుకుంటూ దాన్ని కరెక్ట్ చేసినప్పుడు విధి మాత్రం మారలేదు. ఇది చాలా స్పెషల్ మూవీ. థియేటర్ కి వెళ్లి చూడండి. మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో చాలా పాజిటివ్ వైబ్స్ ని నింపుతుంది. సెప్టెంబర్ 9న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా చూడండి” అన్నారు. *రీతూ వర్మ మాట్లాడుతూ.. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. శ్రీకార్తిక్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. శర్వానంద్ ఈ పాత్రని చాలా సిన్సియర్ గా చేశారు. అమల గారు నాకు స్ఫూర్తి. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ ఇలా చాలా మంచి నటులు ఈ సినిమా కోసం పని చేశారు. సినిమా ఒక సర్ ప్రైజ్ ప్యాకేజీలా వుంటుంది. సెప్టెంబర్ 9న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి” అని కోరారు.*శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మొదట తమిళ్ లో రాశాను. ప్రభు గారు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. తెలుగు లో కూడా చేద్దామని నాకు నమ్మకం ఇచ్చారు. తరుణ్ భాస్కర్ గారు డైలాగ్స్ రాశారు. నేను తెలుగు వాడ్నే. మా అమ్మ తెలుగు. ఈ సినిమా అమ్మ గురించిన సినిమా ఇది.. కాలంతో ప్రయాణం వుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ తన నటనతో మీ అందరికీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తాడు. అమల మేడమ్ గారితో పని చేయడం మర్చిపోలేను. అమల గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. రీతూ వర్మ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా వుంటుంది. ప్రభు గారు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా కూడా మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ పాత్రలతో పాటు మిగతా పాత్రలు ఇందులో కీలకంగా వుంటాయి. సిరివెన్నెల లాంటి లెజండరీ రచయిత మా సినిమాకి రాసిన అమ్మ పాట చిరకాలం నిలిచిపోతుంది. ఆయన ఆశీస్సులు మాపై వుంటాయి. సెప్టెంబర్ 9న ఈ సినిమా వస్తోంది. చాలా కొత్త కంటెంట్. మీ అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది” అన్నారు.*ప్రభు మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ నేపధ్య సంగీతం పాటు చెప్పారు. కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాం. అప్పుడే మాకు చాలా నమ్మకం వచ్చింది. చాలా అనుభూతిని ఇచ్చే కథ ఇది. శర్వానంద్, అమల, రీతు గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తో పాటు మిగతా నటీనటులు అద్భుతంగా చేశారు. మయూరి, ఖాకీ, ఖైదీ చిత్రాలని ఆదరించారు. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా చేశాం. సెప్టెంబర్ 9న సినిమా వస్తోంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ కావలి” అన్నారు.
ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చింది చిత్ర బృందం :
*’అమ్మ చెప్పింది’ చేశారు కదా.. ఒకే ఒక జీవితం అమ్మ కోసం పడే తపనలా వుంది ఇందులో ఏం చెప్పబోతున్నారు ?
శర్వానంద్ : మనం గడిపే ప్రతి క్షణం ముఖ్యం. అమల గారు చెప్పినట్లు అమ్మ కొంతవరకే. తర్వాత ఇంకో జర్నీ మొదలౌతుంది. అమ్మ వున్నప్పుడు మొదట గ్రాంటడ్ గా తీసుకునేది అమ్మనే. అందుకే అమ్మతో వున్న ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా చుసిన తర్వాత ఈ క్షణం మళ్ళీ దొరుకుతుందోలేదో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనే ఆలోచన వస్తుంది. చాలా అరుదైన కథ ఇది. నాకు చాలా తృప్తి వుంది. ఇందులో శర్వానంద్ ని కాకుండా దర్శకుడు రాసుకున్న పాత్రే కనిపిస్తుంది.
*కథ చెప్పినపుడు ఒక తల్లిగా ఏమైనా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా ?
అమల : ఒక నటిగా తృప్తిని ఇచ్చిన కథ ఇది. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి.
*సైన్స్, సెంటిమెంట్ ని బ్లండ్ చేయడం కష్టం కదా.. దిన్ని ఎలా తీర్చిదిద్దారు ?
కార్తిక్ : ఇది మదర్ సెంటిమెంట్ సినిమా కాదు. కాలంతో ప్రయాణించే కథ. చాలా డిఫరెంట్ జోనర్ లో ఈ కథ వచ్చింది. కాలంతో ప్రయాణం అంటే ఫాంటసీలా వుండదు. ఇది చాల థ్రిల్ ఇచ్చే సబ్జెక్ట్. సినిమా చూసినప్పుడు మీరు చాలా ఎక్సయిట్ అవుతారు.
*ఇది మీకు మొదటి సినిమా కథా.. మదర్ సెంటిమెంట్ తో సినిమా చేయాలని ఎందుకనిపించింది ?
కార్తిక్ : మా అమ్మ కొన్నేళ్ళ క్రితమే వెళ్ళిపోయారు. అమ్మని మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది. ఆ ఇమాజినేషన్ తో కథ రాసినప్పుడు నాకు చాలా నచ్చింది.
*ఈ పాత్రకు కనెక్ట్ అవ్వడానికి కారణాలు ఏమిటి ?
శర్వానంద్ : అమ్మ ఎమోషన్ ఒక కారణం అయితే.. ఈ కథలో ఒక మ్యాజిక్ వుంది. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరి చేసుకునే అవకాశం వస్తే.. ఎలా వుంటుందో చాలా బ్రిలియంట్ గా ట్రీట్ చేశారు దర్శకుడు కార్తి. అది నాకు చాలా నచ్చింది.
*మీరు సినిమాలకు ఎక్కువ విరామం ఇచ్చి చేయడానికి కారణం ?
అమల : నిజంగా నాకే తెలీదు. నా జీవితం తీరికలేకుండా వుంది. అన్నపూర్ణ కాలేజ్, మీడియా ఒకవైపు బ్లూ క్రాస్ మరో వైపు, కుటుంబం ఇలా జీవితం బిజీ , ఎక్సయిటింగా వుంది. వీటి మధ్య సినిమా చేయాలంటే కార్తిక్ లా వచ్చి నన్ను ఆ బిజీ లైఫ్ నుండి బయటికిలాగి చేయించాలి. చాలా అవకాశాలు వస్తాయి. నాకు చాలా రకాల పాత్రలు చేయాలనీ వుంటుంది. కానీ నాకు మాత్రం బాగా కన్నీర్రు పెట్టుకునే పాత్రలు ఇస్తారు(నవ్వుతూ). నా పర్సోనా అలా వుంటుంది. నిజంగా నేను ఏడ్చేస్తాను కూడా. ఎమోషన్ ని దాచుకోలేను.
*ఈ సినిమాలో ఎక్కువ తెలుగు నటులు కనిపిస్తున్నారు.. పూర్తిగా తెలుగులో చేశారా ?
ప్రభు : ఈ కథకి అద్భుతమైన నటుడు కావాలి. శర్వానంద్ ఈ కథకు వంద శాతం న్యాయం చేస్తాడనిపించింది. ప్రియదర్శి , వెన్నెల కిశోర్ పాత్రలకు తమిళ్ వెర్షన్ లో వేరే నటులు కనిపిస్తారు.
*ఈ సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది ?
రీతూ వర్మ : ఈ కథ శర్వానంద్ పాత్ర చుట్టూ వుంటుంది. మిగతా పాత్రలు ఎలా ప్రయాణించాయనేది ఒకే ఒక జీవితం కథ.
*రామ్ చరణ్, రానా, ప్రభాస్ గారికి సినిమా ఎప్పుడు చూపిస్తారు ?
5,6,7తేదిల్లో షో వేయాలనే ఆలోచన వుంది. వారికి ముందే చూపించాలానే ఎక్సయిట్ మెంట్ వుంది.
*ఈ సినిమా తెలుగు నేటివిటీలో వుంటుందా తమిళా ?
శర్వా : అమల గారు తమిళ్ లో స్టార్. అక్కడ అమల గారి క్రేజ్ చూసి షాక్ అయ్యా. నేను తమిళ్ లో సినిమా చేసి చాలా కాలమైయింది. ఈ సినిమాని తెలుగు తమిళ్ లో ఏక కాలంలో తీశాం. ప్రతి సీన్ ని రెండు సార్లు, రెండు భాషల్లో తీశాం. ఈ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.