ఒడిశా వేదికగా పురుషుల హాకీ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాకీ క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇండియా జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిస్తే.. ప్రతీ ఆటగాడికీ కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. పట్నాయక్.. బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్‌లోని ప్రపంచ కప్ విలేజ్ ను ప్రారంభించారు.

ఈ సమయంలో అక్కడి వసతి పొందుతున్న జాతీయ పురుషుల హాకీ జట్టుతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియాకు బెస్ట్ విషెస్ కూడా తెలిపారు. ఇండియా జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందని పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయిక్ రూర్కెలాలో ఆరంభించిన ఈ స్టేడియం 15 ఎకరాల్లో రూ.146 కోట్ల వ్యయంతో నిర్మించారు. గిరిజన ఉద్యమ నేత బ్రిసా ముండా పేరు పెట్టిన ఈ మైదానం దేశంలోనే పెద్ద హాకీ స్టేడియం.












