అక్టోబరు 24, 25, నవంబరు 8న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.
అక్టోబరు 25న మంగళవారం సూర్యగ్రహణం రోజున ఉదయం 8 నుండి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 12 గంటలు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
నవంబరు 8న చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం రోజుల్లో శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా టిటిడి రద్దు చేసింది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.
——————————————————————
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.