‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ అక్టోబర్ 14 న రిలీజ్

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రం నుండి విడుదల చేసిన “నిలదీస్తుందా అంటూ సాగే ఈ విరహ గీతంతో పాటు విడుదలైన అన్ని పాటలకు  సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి  కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం. ఆర్. సి. వడ్ల పట్ల ,నిర్మాతలు సి. హెచ్ వి. యస్. యన్ బాబ్జి, కాసుల రామకృష్ణ, రవీంద్ర గోపాల్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు. వీరితో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం  చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశంలో తెలుగు నిర్మాతల మండలి  కార్యదర్శి మెహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..ఇంతకుముందు ముల్లేటి నాగేశ్వ‌రావు చాలా మంచి సినిమాలు తీశాడు. పదిహేను సంవత్సరాల గ్యాప్ తరువాత నిర్మించిన నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”..సినిమాలో పాటలు టీజర్ ట్రైలర్ చాలా బాగున్నాయి, చాలా  మంది సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ వేసుకొని థియేటర్స్ దొరకడం లేదు అని ఫిలిం ఛాంబర్ కు రావడం జరుగుతుంది. అప్పుడు మేము ఏమి చేయలేము.. అలాకాకుండా సినిమా మెదలు పెట్టే టైమ్ లోనే ఫిలిం ఛాంబర్ కు వచ్చి మీ ప్లానింగ్, రిలీజ్ డేట్స్ చెపితే సినిమా రిలీజ్ టైమ్ లో మేమే థి యే టర్స్ ఇప్పిస్తాము. ఈ నెల 14 న వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు  గొప్ప విజయం సాదించాలి. యం. ఆర్. సి. వడ్లపట్ల చౌదరి మాట్లాడుతూ..ముల్లేటి వారు సినిమాను ఒక తపస్సు లా భావించి చాలా కష్టపడి  తీశారు. మంచి కథ కు  సెలెక్ట్ చేసుకొని  చాలా చక్కగా తీశారు.ఈ సినిమా తరువాత  ముల్లేటి ఫ్యామిలీ తో మరో సినిమా తీస్తున్నాము. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థలో యూత్ కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెర‌క్కించడం జరిగింది.హుషారు , రౌడీ బాయ్స్, షికారు  తరువాత సోలో హీరోగా నటిస్తున్న తేజ్ కూరపాటి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు.. హీరోయిన్ కు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించింది.వీరితో పాటు ఇందులో నటించిన వారందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.ఇందులో సునీల్ గారు వాయిస్ అందించారు. ఈ నెల 14 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 చిత్ర నిర్మాతలు ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన  టీజర్ కు, పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు మేము ఆగష్టు 19 న రిలీజ్ చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు ఆ తరువాత సెప్టెంబర్ 2 న రిలీజ్ చేద్దాం అనుకున్నాము  అప్పుడు మాకు సరైన థియేటర్స్ దొరకనందున పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము.. ఫైనల్ మాకు థియేటర్స్ దొరకడంతో ఈ నెల 14 న  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము.మా సినిమాను, మమ్మల్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ..మంచి కంటెంట్ తో  రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా  వస్తున్న  “నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా” సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.ప్రతి ఒక్కరికీ రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో  మేము తీసిన ఈ సినిమా కు సరైన థియేటర్స్ దొరకనందున మేము సినిమా ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము. చివరకు మాకు అనుకున్న థియేటర్స్ లభించడం తో  ఈ నెల 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. అందరూ మా సినిమాను అశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు. చిత్ర హీరో  తేజ్ కూర‌పాటి మాట్లాడుతూ ..”నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.. సినిమా రెండు సార్లు పోస్ట్ పోన్ అయినా కూడా నిర్మాతలు భయపడకుండా కంటెంట్ మీద  ఉన్న నమ్మకంతో  ఎంతో  దైర్యంగా రిలీజ్ చేయడానికి  ముందుకు వచ్చారు. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ నెల 14 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర హీరోయిన్ అఖిల ఆకర్షణ  మాట్లాడుతూ..”నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.. సినిమా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఈ నెల 14 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు  ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 14 న వస్తున్న “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”..సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు. న‌టీన‌టులు: తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా టెక్నికల్ టీం: ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌ సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌ సంగీతం.. సందీప్ కుమార్‌ స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి
ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి స్టంట్స్‌.. రామ కృష్ణ‌ కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్ పి .ఆర్. ఓ :  మధు వి. ఆర్
Attachments area

Related Posts

Latest News Updates