హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు నుమాయిష్ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ప్రారంభం కానుంది.8దశాబ్దాలుగా ఈ ప్రదర్శ నకు ఆతిథ్యం ఇస్తున్న నాంపల్లి ఎగ్జి బిషన్ గ్రౌండ్ 81వ నుమాయిష్‌కు ముసతబైంది. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 15వరకు 45రోజులపాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సాగ నున్న ఈ ప్రదర్శనలో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వ్యాపారులకు చెందిన 2,400కు పైగా స్టాళ్లు కొలువుదీరాయి. ఈసారి ఎగ్జిబిషన్ స్టాళ్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. డ్వాక్రా, మెప్మా, సింగరేణి కాలరీస్‌కు చెందిన సంస్థల స్థాళ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయించారు.
మూడు సంవత్సరాల విరామం తర్వాత పూర్తిస్థాయిలో కొలువుదీరుతున్న ఈ ప్రదర్శన కు ఎలాంటి అవాంతరాలు రాకుండా రెవెన్యూ, పోలీస్, జీహెచ్ ఎంసీ, ఫైర్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి 15 వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయా వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.