జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో సినిమా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 30 మూవీ ఎనౌన్స్ అయ్యి చాలా కాలమే అయినా, ఇంతవరకు పట్టాలు ఎక్కులేదు. దీనికి కారణం ఇప్పటి వరకు కథ ఓ కొలిక్కి రాలేదనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు హీరోయిన్స్ కూడా ఖరారు కాలేదు. దీంతో ఈ సినిమా షూట్‌కు వెళ్ళడానికి మరింత సమయం పట్టేలా ఉందని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేష్‌లో సినిమా లాక్ అయ్యి చాలా రోజులే అయ్యింది. జనతా గ్యారేజ్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అన్నీ సక్రమంగా జరిగినట్టైతే, ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకునేది. కానీ ఇప్పటి వరకు తారక్ 30 మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోగా, కథ ఫైనల్ కావడంలేదని, హీరోయిన్స్ సెట్ అవడంలేదని రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 30 మూవీ అనౌన్స్ అయ్యాక తారక్ రేంజ్ అమాంతం పెరిగింది. దానికి కారణం ఈ గ్యాప్‌లో వచ్చిన RRR మూవీ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీ దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ అయ్యి, అపజయమే ఎరుగని కొరటాల ఖాతాలో తొలి ప్లాప్ వచ్చి పడింది. దీంతో ఎన్టీఆర్ 30 మూవీ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలో ముందుగా ఫైనల్ చేసిన కథను మార్చమని తారక్ చెప్పారని టాక్. దీంతో ప్రెజెంట్ ఎన్టీఆర్ రేంజ్‌కు తగ్గట్టు, యూనివర్సల్ అప్పీల్ వచ్చేలా, కొరటాల శివ మరో పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు టైమ్ పడుతుందని, సినీ వర్గాల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఇక స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ఈ మూవీ కాస్టింగ్ కూడా సమాంతరంగా జరుగుతున్నా, హీరోయిన్స్ మాత్రం ఫైనల్ కావడంలేదట. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాని తీస్తుండడంతో, ఈ సినిమా కోసం మొదట బాలీవుడ్ భామల్ని తీసుకోవాలని మేకర్స్ భావించారు. అయితే వారి రెమ్మునరేషన్ హై రేంజ్‌లో ఉండడంతో వెనక్కు తగ్గారట. ఆ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న అయితే కరెక్ట్‌గా సెట్ అవుందని మేకర్స్ భావించారు. ఈ మూవీలో రష్మికనే హీరోయిన్‌గా ఖరారు అయ్యిందన్నా.. అదీ జరగలేదు. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా కన్నడ భామ శ్రీలీల పేరు వినిపిస్తుంది. పెళ్లిసందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, తెలుగులో అరడజను సినిమాలకు సైన్ చేసి ఫుల్ బిజీగా ఉంది. రవితేజ, రామ్ సినిమాల్లో శ్రీలీలనే హీరోయిన్. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో కూడా శ్రీలీలను ఫైనల్ చేశారనే టాక్ సినీవర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే శ్రీలీలకు వరుసగా ఆఫర్స్ రావడం వెనుక , దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు హ్యాండ్ ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు తారక్-శివ మూవీలో కూడా శ్రీలీల ఎంపిక వెనుక ఈ దర్శకుడి హస్తం ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే శ్రీలీల కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.