అమెరికాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన భారత సంతతి కుటుంబం దారుణంగా హత్యకు గురైంది. 8 నెలల చిన్నారితో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మెర్సిడ్ కౌంటీలోని ఓ పండ్ల తోటలో ఈ మృతదేహాలు దొరికాయని పోలీసులు తెలిపారు. ఇండియానా రోడ్, హన్సన్ రోడ్ సమీపంలోని ఓ తోటలో ఈ శవాలను అక్కడ పనిచేసే వ్యక్తి గుర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 8 నెలల పాప, 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, మేనమామ అమన్ దీప్ సింగ్ ఇటీవలే కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయం తెలియగానే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
