మరోసారి కవ్వించిన ఉత్తర కొరియా!

ఉత్తర కొరియా మరోసారి ఉద్రిక్తతలను రాజేసింది. స్థానిక కాలమానం ప్రకారం నేడు ఉదయం 7 గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడిరచింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడిరది. దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న  సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకొంది. అదే సమయంలో ఈ క్షిపని పరీక్ష జరగడం గమనార్హం. ఉత్తరకొరియా క్షిపణి తీవ్రమైన కవ్వింపు చర్య అని సియోల్‌ వర్గాలు ఆరోపించాయి. తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని దక్షిణ కొరియా పేర్కొంది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని పేర్కొంది.

Related Posts

Latest News Updates