భారత దేశమే నా శాశ్వత నివాసం.. చైనా వెళ్లను : దలైలామా ప్రకటన

చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని బౌద్ధ గురువు దలైలామా తేల్చి చెప్పారు. భారత దేశమే తనకు అత్యుత్తమ ప్రదేశమని అన్నారు. చైనాకు తిరిగి వెళ్లడంలో అర్థమే లేదన్నారు. “నేను భారత్‌ను ఎంచుకున్నాను. నా ప్రాధాన్యం భారత్ కే. ఇదే ఉత్తమ ప్రదేశం. ‘కాంగ్రా’ నెహ్రూ ఎంపిక. ఇదే నా శాశ్వత స్థానం” అని తెలిపారు. భారత్, చైనా మధ్య జరుగుతున్న సంఘర్షణలపై కూడా స్పందించారు. యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కొన్ని పరిస్థితుల విషయంలో సానుకూల మార్పులు వస్తున్నాయని, చైనా కూడా ఇప్పుడు కాస్త మెత్తగా మారిందన్నారు. అయినప్పటికీ నేను మళ్ళీ చైనాకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.

Related Posts

Latest News Updates