కంబాట్ హెలికాప్టర్లను సైన్యంలోకి ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్ సింగ్

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ హెలికాప్టర్లను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశపెట్టారు. ఆయనతో పాటు సీడీఎస్ అనిల్ చౌహాన్, ఐఏఎఫఖ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ కూడా వున్నారు. దేశీయంగా తయారు చేసిన ఈ తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ్ ను జోధ్ పూర్ ఎయిర్ బేస్ వేదికగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ కంబాట్ హెలికాప్టర్ ఎక్కి ప్రయాణించారు. ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) అభివృద్ధి చేసిన ఈ ఎల్‌సీహెచ్‌లను ప్రధానంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించేందుకు వీలుగా డిజైన్ చేశారు.

 

 

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశీయంగా తయారు చేసిన కంబాట్ హెలికాప్టర్ చాలా సౌకర్యవంతంగా వుంటుందని తెలిపారు. ఎలాంటి పర్వత శ్రేణుల్లోనైనా, ఎత్తుగా వున్న ప్రదేశాలతో పాటు ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలదని వివరించారు. అలాగే ఎక్కువ ఆయుధాలను మోస్తూ.. శత్రువులపై దాడులు చేసే సామర్థ్యం కూడా కలిగి వుంటాయని రాజ్ నాథ్ అన్నారు. ఎల్‌సీహెచ్‌ల ప్రవేశంతో ఐఏఎఫ్ పోరాట పటిమ మరింత పెరిగిందని ఆయన తెలిపారు.

Related Posts

Latest News Updates