ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకురాకపోవడంపై స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ పై అక్కడి రైతులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు స్థానిక రైతులు ధర్మపురి అర్వింద్ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే… రొటీన్ గా కాకుండా… ఈ సారి ధర్మపురి అర్వింద్ ని ఎద్దేవా చేస్తూ.. ఈ ఫ్లెక్సీలు రావడం సంచలనం రేపుతోంది.‘పసుపు బోర్డు… ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని కాస్త వెటకారాన్ని యాడ్ చేసి మరీ నిజామాబాద్ అంతటా రైతులు ఫ్లెక్సీలను అంటించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి, ఇప్పుడు మోసం చేశారని రైతులు మండిపడుతున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమేకాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.