వచ్చే యేడాది అక్టోబర్ నుంచి కారులో 6 ఎయిర్ బ్యాగులు.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం

కార్లలో ఎయిర్ బ్యాగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే యేడాది అక్టోబర్ నెల 1 వ తారీఖు నుంచి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలన్న నియమాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కార్ల కంపెనీలు అన్నీ కచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలని ఆదేశించారు. ఈ అక్టోబర్ నుంచే ఈ రూల్ను అమలు చేయాలని కేంద్రం అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు గడ్కరీ తెలిపారు. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా దీనిని అమలుచేయాలన్న గడ్కరీ.. మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని తెలిపారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం