కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ పర్యటన సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాల్లో వుండగా… తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యక్రమాన్ని అధికారులు ఆపేశారు. వెంటనే అధికారులు ఆయనను గెస్ట్ హౌజ్ లోకి తీసుకెళ్లి… ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత డార్జిలింగ్ లోని సిలిగురి నుంచి వైద్యుడ్ని పిలిపించారు. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడం వల్లే ఇలా జరిగిందని ప్రకటించారు. తదనంతరం ఆయనకు సెలైన్ ఎక్కించారు. షెడ్యూల్ ప్రకారం నితిన్ గడ్కరీ 1,206 కోట్ల విలువైన మూడు జాతీయ రహదారుల శంకుస్థాపన చేసేందుకు డార్జిలింగ్ కు వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత దల్ఖోలాకు వెళ్లాలి. కానీ అస్వస్థతతో కార్యక్రమాన్ని రద్దు చేశారు.
