షిప్పింగ్ రంగంలో ఏపీ కీలకం… సర్కార్ ముందుకు వస్తే.. లాజిస్టిక్ పార్క్ ఇస్తాం : గడ్కరీ

ఏపీలో 5 లక్షల కోట్లతో హైవేలను డెవలప్ చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 2024 నాటికి ఏపీలో హైవే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. నితిన్ గడ్కరీ రాజమండ్రిలో పర్యటించి, పలు హైవే ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లకు శంకు స్థాపనలు చేశారు. ఏపీ సర్కార్ ముందుకు వస్తే లాజిస్టిక్ పార్క్ ఇస్తామని ప్రకటించారు. అలాగే.. భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకూ 6 లైన్ల హైవే నిర్మాణం చేపడతామని, విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు చేస్తామని గడ్కరీ తెలిపారు. షిప్పింగ్ రంగంలో దేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదేనని గడ్కరీ ప్రకటించారు. మరోవైపు కడియం, శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

 

రాజమండ్రి వేదికగా గడ్కరీ 5 ఫ్లైఓవరకు శంకు స్థాపన చేవారు. జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు 3 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు గడ్కరీ ప్రకటించారు.

Related Posts

Latest News Updates