రికార్డులు నెలకొల్పిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్…. ఎందుకంటే

ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగాఇది ఐదోసారి. కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఐదో సారి ఆర్ధిక మంత్రి హోదాలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్రపతిని ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. బడ్జెట్ పై రాష్ట్రపతికి సమాచారం ఇచ్చారు. తొలుత మహిళగా ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఉండగా.. నిర్మలా సీతారామన్ రెండో మహిళ. అయితే ఇందిరా గాంధీ తాత్కాలిక ఆర్థిక మంత్రి మాత్రమే.

ఇక ఈసారి బడ్జెట్‌తో వరుసగా ఐదుసార్లు, మొత్తంగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగానే కాదు.. ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. తొలిసారి 2019-20 బడ్జెట్‌లో 137 నిమిషాల సేపు ప్రసంగించగా అప్పటివరకు అదే రికార్డు.

సుదీర్ఘ ప్రసంగం అదే. 2003-04లో జస్వంత్ సింగ్ 135 నిమిషాల సేపు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక 2020-21లో 162 నిమిషాల సేపు ప్రసంగించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. కరోనా సమయంలో డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సరికొత్త సంప్రదాయంగా వచ్చింది. సరికొత్త యాప్‌ను కూడా లాంఛ్ చేశారు. అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దారు.

Related Posts

Latest News Updates