విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా గ్రాండ్‌గా ‘నిన్నే పెళ్లాడతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ పతాకాలపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా.. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్ గా వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’.  ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, మరియు డైలాగ్ కింగ్ సాయి కుమా‌ల ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ..దర్శకుడు వైకుంఠ ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఇందులో నాకు మంచి డైలాగ్స్ ఉన్నాయి.  నిర్మాతలు మంచి కథ ను , మంచి టైటిల్ ను,  మంచి క్యాస్టింగ్, టెక్నిషియన్స్ ను సెలెక్ట్ చేసుకొని  తీసిన  ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ నెల 14 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
ముఖ్య అతిధిగా  వచ్చిన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా హీరో అమన్‌ చాలా జోవియల్ పర్సన్,. తను ఈ సినిమాలో  ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్  ఇలా అన్ని రకాలుగా చాలా బాగా చేశాడు..50 సంవత్సరాలనుండి  సాయికుమార్ గారు నటించడమంటే  గ్రేట్ హనర్, హీరో, హీరోయిన్ లకే కాకుండా.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి గుర్తింపు వస్తుంది… మంచి టైటిల్ తో వస్తున్న దర్శక,నిర్మాతలకు ఈ చిత్రం పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..ఆమన్ నాకు మంచి మిత్రుడు. డైరెక్టర్ వైకుంఠ  గారు సినిమా చాలా బాగా తీశారు. నవనీత్  గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కథను  సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా నిర్మాతలకు గొప్ప విజయం సాదించాలి. టీం అందరికీ అల్ ద  బెస్ట్ అన్నారు. చిత్ర నిర్మాతలు బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు లు మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన  హీరోలు, విశ్వక్ సేన్, సిద్దులకు ధన్యవాదాలు . ‘నిన్నే పెళ్లాడతా’ అనే టైటిల్ వినగానే గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జునగారు. ఆయన ఇప్పటికే మాకు ఆశీస్సులు అందించారు. చిత్ర ఫస్ట్ లుక్ ఆయన చేతులు మీదుగా విడుదల చేయడం  జరిగింది .  దర్శకుడు వైకుంఠ బోను మాకు చెప్పిన కథను  చెప్పునట్టుగా  చాలా చక్కగా  తెరాకెక్కించాడు . అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఈ చిత్రం ఈ నెల 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల  ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు  వైకుంఠ బోను మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వాఫించడానికి  వచ్చిన  విశ్వక్, సిద్దులకు ధన్యవాదములు. సాయి కుమార్ గారు ఈ సినిమాకు చాలా హెల్ప్ చేశారు. సినిమా డైలాగ్స్, మేకింగ్స్ బాగుంటాయి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన  నిర్మాతలకు  ధన్యవాదాలు.  చిత్ర హీరో అమన్ మాట్లాడుతూ… మమ్మల్ని ఆశీర్వదించడానికి  వచ్చిన  విశ్వక్, సిద్దులకు ధన్యవాదములు. మేము విడుదల చేసిన  ట్రైలర్ కు పాటలకు  ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.సాయికుమార్ గారితో నటించడం మొదట భయమేసినా తనెంతో ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాకు నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు  ధన్యవాదములు అన్నారు. కో ప్రొడ్యూసర్ సాయి కిరణ్ కోనేరి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి సాయి కుమార్ సినిమాలు చూసి పెరిగిన నేను ఇప్పుడు తనతో స్క్రీన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తనద్వారా చాలా నేర్చుకున్నాను.హీరో అమన్ చాలా బాగా నటించాడు. డైరెక్టర్ గారు ఈ కథను చాలా చక్కగా  హ్యాండిల్ చేశాడు..ఈ నెల 14 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. నటుడు గగన్  విహారి  మాట్లాడుతూ..ఈ సినిమాను సపోర్ట్ చేయఫనికి  రావడంతో  సినిమాకు అమన్ చాలా బాగా నటించాడు.ట్రైలర్, పాటలు  చాలా బాగున్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్  మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదములు అన్నారు  నటీ నటులు  అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధికా శర్మ (‘పైసా’ మూవీ ఫేమ్)  డైలాగ్ కింగ్ సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, అన్నపూర్ణమ్మ, విద్యుల్లేఖ రామన్, మధు నందన్, గగన్ విహారి తదితరులు  సాంకేతిక నిపుణులు  బ్యానర్స్ : ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ సంగీతం: నవనీత్ కెమెరా: ప్రసాద్ ఈదర, సురేష్ గొంట్ల లిరిక్స్: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, రాంబాబు గోసాల డిటర్: అనకాల లోకేష్ కోరియోగ్రాఫర్ : కళాధర్ పీఆర్వో: బి. వీరబాబు నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వైకుంఠ బోను

Related Posts

Latest News Updates