నిషేధిత పీఎఫ్ఐ కేసు విషయమై ఎన్ఐఏ రాజస్థాన్ లోని పలు చోట్ల సోదాలు నిర్వహించింది. రాజస్థాన్ లోని 9 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయని పేర్కొంది. జైపూర్ లో 4 ప్రాంతాలు, కోటాలో 4 ప్రాంతాలు, సవాయ్ మాదోపూర్ లో ఒక చోట సోదాలు చేశామని ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాదిఖ్ సర్రాఫ్, మహ్మద్ ఆసిఫ్, అష్రఖ్ మీర్జాతో పాటు మరి కొందరు నిషేధిత పీఎఫ్ఐ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు పేర్కొంది. వారి వారి ఉపన్యాసాల ద్వారా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నారని తెలిపింది.
రాజస్థాన్ వేదికగా సాధిఖ్ షరాఫ్, మహ్మద్ ఆసిఫ్ యువకులను ర్యాడికలైజేషన్ వైపు తీసుకెళ్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే 9 ప్రాంతాల్లో సోదాలు చేశామని, ఈ సందర్భంగా ఫోన్లు, సిమ్ కార్డులు, కత్తులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది. తదుపరి విచారణ కూడా కొనసాగుతుందని పేర్కొంది.












